Monday, February 2, 2009

Sense of Achievement


మొన్న శనివారం CK (చెన్న కేశవ రెడ్డి B.Com 1984-87) కి కాల్ చేసి - "ఏం తంబి, బావున్నావా?" అని పలకరించా. కొంచెం సేపు అవి ఇవి సంగతులు మాట్లాడాక, రేపు హైదరాబాద్ లో మన వాళ్లు అందరూ కలుస్తున్నారు, నీకు తెలుసా అని అడిగాడు. తెలీదే అంటే, నాకూ వెళ్ళటం కుదరట్లేదు అన్నాయ్ అన్నాడు. (చాలా విచిత్రమైన విషయమేమిటంటే CK నాకు 1 year సీనియర్. నేను కాలేజీ లో చేరిన కొత్తలో నన్ను - " ఏమన్నా ఏంటి సంగతులు?" అని పలకరించాడు. అప్పటికి ఇంక మన కాలేజీ లో ragging లేదని confirmed గా తెలిసిపోయింది కాబట్టి :) , నేనూ ధైర్యంగా - "సంగతులు ఏమీ లేవు తంబి" - అన్నా! ఇప్పటకి 23/24 years అవుతోంది - ఇప్పటికీ నేను తనని తంబి అనే పిలుస్తా, తను నన్ను అన్నాయ్ అంటాడు) .

తర్వాత నా friend బాలాజీ కి కాల్ చేసి మీటింగ్ గురించి చెప్పాను. తను CK కి, NSN Reddy - మా ఇంకో senior కి కాల్ చేసి, మీటింగ్ details కనుక్కుని, వెళ్లి వచ్చి కొంచెం విశేషాలు చెప్పాడు. APRDC alumni చాలా active గా వుంది బద్రి - everybody is coming forward to help the కాలేజీ అని, మీటింగ్ కి వచ్చిన/organize చేసిన మా seniors గురించి, కాలేజీ కి కొని ఇస్తున్న backup power generator గురించి, అక్కడ కట్టాల్సిన water storage tanks గురించి, library కి కావాల్సిన broadband connection గురించి, మా batch 1985-88 కి తను తీసుకున్న fund raising target responsibility గురించి, ఇంకా బోల్డన్ని సంగతులు చెప్పాడు. Felt so very happy!

NSN, aprdc_alumni గ్రూప్ కి invite చేస్తే ఇవ్వాళే member గా జాయిన్ అయ్యాను. Hats off to the person(s) who have initiated and are actively maintaining that group! I will be encouraging the members on the group (arpdc) I created long time ago to move to the new group.

ఇప్పటివరకు కాలేజీ నుంచి బయటకి వచ్చేశాక ఎవరైనా ఆలోచించారో లేదో నాకు తెలియదు కాని, నేను మాత్రం మన కాలేజీ కి అంత గొప్పదనం ఎందుకు వచ్చిందో అని ఆలోచిస్తే అంత ఈజీ గా ఆన్సర్ దొరకలేదు. అక్కడ నాకు teach చేసిన టీచర్స్ వలనా, లేక father-like పర్సనాలిటీ తో కాలేజీ ని కమాండ్ చేసిన VY Reddy గారి వలనా, లేక కాలేజీ లో అడుగు పెట్టినప్పటినుంచీ juniors ని ఒక ఫ్యామిలీ లో members గా invite/treat చేసిన మంచి seniors వలనా, లేక అప్పుడే తెలిసినా ఎప్పుడో చిన్నప్పటినుంచి తెలిసిన వాళ్ళ లాగ నన్ను ప్రేమగా పలకరించిన నా classmates వలనా, లేక అన్ని మంచి traditions ని continue చేసిన/చేస్తున్న juniors వలనా, లేక మాములుగానే నాగార్జున సాగర్ famous కాబట్టి, మన కాలేజీ కూడా అంతే famous అయ్యిందా? అంటే answer చెప్పటం ఎంత కష్టం కదా? ఈ రోజు నేను ఇంత మంచి position లో వున్నందుకు నాకు నా degree కాలేజీ ఎంత హెల్ప్ చేసిందో!

అస్సలు సాగర్ కాలేజీ లో అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఏదో సాధించాలన్న ambition - మిగతా డిగ్రీ కాలేజీ వాళ్ళకన్నా, APRDC స్టూడెంట్స్ అంటే చాలా ముందు వుండాలి అన్న వుద్దేశ్యం - ఎప్పుడూ ఎవరూ explicit గా చెప్పకపోయినా - I guess it was always implied and was there on everyone's mind. RL Gupta, Shukla books ని అవేవో అతి మామూలు books అన్న తీరులో చదవాలని, problems solve చెయ్యాలని ట్రై చెయ్యటం ! మిగతా కాలేజీల్లో ఎవరో ఒకరో ఇద్దరో టాప్ స్టూడెంట్స్ కి వచ్చే/వుండే ఆలోచనలు, మనకి కాలేజీ లో వుండే అందరికీ వుండేవి. I just wonder how that was even possible!

నేను చదువుకున్న పుస్తకాలు, నోట్స్ ఇంట్లో మా తమ్ముడికి ఇచ్చానో లేదో గుర్తు లేదుకానీ, డిగ్రీ కాలేజీ seniors చాలా ప్రేమగా వాళ్ల నోట్స్ మాకు ఇచ్చి, బాగా చదువుకోమని జాగ్రత్తలు చెప్పటం మాత్రం బాగా గుర్తు వుంది. డిగ్రీ అయ్యినతర్వాత అందరీ ambitions మంచి మంచి Universities లో MCA/ MA/MS/MCom/MBA లు చదవాలనీ, CA/CWA/IAS/IPS చెయ్యాలని! మన డిగ్రీ కాలేజీ లో చేరక ముందు - అంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, even APRDC entrance exam రాసేటప్పుడు కూడా, ఎంత మందిమి ఆ చదువుల గురించి ఆలోచించి వుంటాము, ఆ ambitions తో కాలేజీ లో అడుగు పెట్టి వుంటాము? !

I somehow feel there was always a great sense of achievement planted/embedded into every student of our great college.

Here is another great photo that I have preserved. ఈ ఫోటో 1984-87 full batch ది.

Enjoy!

Sunday, January 4, 2009

Unforgettable Memories at APRDC

మనకి చాలా ఇష్టమైనవి ఎన్ని వున్నా, ఇంకా కావాలనిపిస్తూనే వుండే వాటిలో - మనకి నచ్చే జ్ఞాపకాలు ఒకటి. అందులో ఒక చక్కటి జ్ఞాపకం సాగర్ లో నా డిగ్రీ చదువు, అక్కడి నా ఫ్రెండ్స్.

విజయపురి
సౌత్/రైట్ బ్యాంక్, పైలాన్, హిల్ కాలనీ, కాలేజీ కి ఎదురుగా వుండే గుడి, ఆ గుళ్ళో సాయంత్రం పూట వచ్చే పాటలు, down town (!) లో రామకృష్ణ ధియేటర్ - అందులో సినిమా స్టార్ట్ అయ్యేముందు వచ్చే పాటలు, పక్కనే బస్ స్టాండ్ దగ్గర భాను స్టోర్స్ లో వీడియో సినిమాలు, సాగర్ డామ్ మీద కూర్చున్న సాయంత్రాలు, శని ఆది వారాల్లో Jharia లాంచ్ లో వెళ్ళే visitors ని చూడటం, ఎవరైనా బంధువులు గాని, ఫ్రెండ్స్ గాని (నా కోసం వచ్చినా, నా ఫ్రెండ్స్ కోసం వచ్చినా - ఒకరి బంధువులు అందరికీ బంధువులే ఒకరి ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్) వస్తే వాళ్ళని నాగార్జున కొండ కి తీసుకు వెళ్ళటం, అక్కడ వుండే guides లాగా యాక్ట్ చేస్తూ - అక్కడి విశేషాలు చెప్పటం, పైలాన్ వెళ్లి డామ్ పవర్ హౌస్ చూపించటం - ఎన్నెన్ని జ్ఞాపకాలో. ఒకోసారి డామ్ మీద కూర్చుని చూస్తుంటే దూరంగా ఎక్కడో దూరంగా పడే వర్షం కనిపిస్తూ వుండేది! How beautiful it was!

గురువారమో, శుక్రవారమో గుర్తు లేదు కాని, సాయంత్రం హాస్టల్ బయటకి allow చేసేవాళ్ళు. ఇంక ఆ రోజు ఎక్కడ బావున్న సినిమా వుంటే అక్కడకి. పైలాన్ కాని, హిల్ కాలనీ కాని వెళ్ళాలంటే, చెక్ పోస్ట్ దగ్గర బస్ దొరికితే (డబ్బులు సరిపోను వుంటే) సరే, లేకపోతే లారీలలో వెళ్లి సినిమా చూసి రావటం. లారీల్లో లోపల చోటు దొరికితే ఒకే, లేకపోయినా నో ప్రాబ్లం - పైన లోడ్స్ మీదకి ఎక్కి వెళ్లిపోవటమే! ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యి వుండొచ్చు కాని, అప్పుడు ఒక్క (single) projector మాత్రమే వుండేది. ప్రతీ 30/40 నిమిషాలకనుకుంటా సినిమా ఆపి, ఒక చిన్న గుడ్డి లైట్ ఆన్ చేసి, రీల్స్ మార్చే వాళ్లు! అయినా సరే కొంచెం కూడా విసుక్కోకుండా ఎంత dedicated గా సినిమా చూసేవాళ్ళం ? ఆ ఆనందమే వేరు. సినిమా అయ్ పోయిన తర్వాత మళ్ళీ లారీ ఎక్కో, అదీ దొరక్కపోతే, ఎంచక్కగా కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూనే హాస్టల్ కి రావటం - ఇవన్నీ ఎంత గుర్తొచ్చినా భలే సరదాగా అనిపిస్తుంది !!

Residential అనే దానికి చక్కటి definition మన కాలేజేమో అనిపిస్తుంది. మూడు ఏళ్ల టైం ఎలా గడిచి పోయిందో - అంతా 300 మంది వున్నఒక పెద్ద ఫ్యామిలీ లాగా - ఆడుకున్నా, పాడుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా, డబ్బులున్నా, లేకపోయినా - అంతా ఒక చోటే. ఒకోసారి అనిపిస్తూ వుంటుంది నాకు, నా డిగ్రీ కాలేజీ లైఫ్ అంత మంచిగా అనిపించటంలో అక్కడి lecturers/principal కృషి, dedication ఎంత వుండి వుంటుందో అని.

డిసెంబర్ 31st బ్లాగ్ పోస్టింగ్ + యాహూ గ్రూప్ ఈమెయిలు చూశాక నా seniors GVSB రెడ్డి గారు (B.Com 1982-85), V శ్రీనివాస్ (B.Com 1984-87) - ఈయన్ని అందరం Builder అని పిలిచే వాళ్ళం, Junior సుభాష్ (బోస్ B.Sc 1988-91) respond అయ్యారు.

Thank you all so much! I am feeling really delighted because we all can use this forum to come together and share our memories at our degree college.

Anyone reading this blog, please let me know if you too would like to share your APRDC memories, I will gladly add you as an author.

ఈసారి ఫోటో 1988 Final Year B.Com, B.Sc, BA అందరూ వున్నది. Enjoy!