Wednesday, December 31, 2008

Unforgettable Memories at APRDC


హలో ఫ్రెండ్స్! నా పేరు బదరి - 1985-88 B.COM batch. అవును, నిజంగా నిజం - నా డిగ్రీ అయ్యి అప్పుడే 20 ఏళ్ళు అయ్యింది! It was 20 long years ago that I stepped out of our beloved APRDC!

ఒకో
సారి నా డిగ్రీ అయ్యి అప్పుడే 20 ఏళ్ళు అయ్యిందా అనిపిస్తుంది !! :) ఒకోసారి నా ఫ్రెండ్స్ తో 23 సంవత్సరాల పరిచయం - more than 1/2 of my life - వుంది అని ఆశ్చర్యం వేస్తుంది. డిగ్రీ అయ్యి చాలా ఏళ్ళు అయ్యింది
కాబట్టి
, నా ఈ పేరు గుర్తు లేని వాళ్ళకి -నా పూర్తి పేరు బదరి నారాయణ గుప్తా, షార్ట్ గా గుప్తా అని పిలిచేవాళ్ళు. ఫోటో లో 8th from right and 9th from left on the last row. గుర్తు పట్టారా?!

డిగ్రీ అయ్యాక తిరుపతి లో MBA చదువు, ఆ తర్వాత బెంగుళూరు లో, గత తొమ్మిది ఏళ్లుగా అమెరికా లో వుద్యోగం.

ఎప్పుడో USA వచ్చిన కొత్తల్లో యాహూ గ్రూప్స్ లో APRDC స్టార్ట్ చేశాను. ఇప్పటికి 57 మెంబర్స్ వున్నారు ఆ గ్రూప్ లో. స్టార్ట్ చేయ్యటమైతే చేశాను కాని, ఎప్పుడూ అంత శ్రద్ధగా ఫాలో అప్ చెయ్య లేదు. ఇప్పుడు ఈ blogspot స్టార్ట్ చేస్తున్నాను - దీనికి ఇన్స్పిరేషన్ హరినాథ్ మల్లేపల్లి blog. ఇవ్వాళ ఫ్రెండ్స్ కి Happy New Year 2009 Wishes messages ఇస్తూ - ఎందుకో aprdc అని google చేశా - చాలా లిస్టింగ్స్ వచ్చాయి - అందులో హరినాథ్ blog కూడా కనిపించింది. భలే హాయిగా అనిపించింది ఆ సైట్ లో ఫొటోస్ చూస్తుంటే.

నా దగ్గర ఇంకా రెండు మూడు గ్రూప్ ఫొటోస్ వున్నాయి, అవి నా next blog లో పోస్ట్ చేస్తాను.

ఈ blogspot మన yahoo గ్రూప్ మెంబర్స్ అందరికీ పంపిస్తాను. Please feel free to share it with our other friends.